Kanti Paapaa Song Lyrics in Telugu, Vakeel Saab




Kanti Paapaa Song Lyrics- కంటిపాపా Song Lyrics from Vakeel Saab, Written by Ramajogayya Sastry and Sung by Armaan Malik

కంటిపాపా  కంటిపాపా  చెప్పనైన  లేదే
నువ్వంతలా  అలా  ఎన్ని  కలలు  కన్నా
కాలి  మువ్వా  కాలి  మువ్వా  సవ్వడైనా  లేదే
నువ్విన్నినాళ్ళుగా  వెంట  తిరుగుతున్నా

నీరాక  ఏరువాక  నీ  చూపే  ప్రేమలేఖ
నీలో  నువ్వాగిపోకా  కలిసావే  కాంతి  రేఖ
అంతులేని  ప్రేమ  నువ్వై    ఇంత  దూరం  వచ్చినాక
అందమైనా  భారమంతా  నాకు  పంచినాకా

మొదలేగా  కొత్తకొత్త  కథలు
మొదలేగా  కొత్తకొత్త  కలలు
ఇకపైనా  నువ్వు  నేను  బదులు
మనమన్నా  కొత్తమాట  మొదలు

కంటిపాపా  కంటిపాపా  చెప్పనైన  లేదే
నువ్వంతలా  అలా  ఎన్ని  కలలు  కన్నా

సాపమాప  మాప  మాగసామగరిసా
సాపమాప  మాప  మాగసామగరిసా

సుదతీ  సుమలోచినీ  సుమనోహర  హాసిని
రమణీ  ప్రియ  భాషిణీ  కరుణాగున  భాసిని
మనసైన  వాడిని  మనువాడిన  ఆమని
బదులీయవే  చెలీ  నువు  పొందిన  ప్రేమనీ
పండంటి  ప్రాణాన్ని  కనవే  కానుకగా

సాపమాప  మాప  మాగసామగరిసా
సాపమాప  మాప  మాగసామగరిసా

ఎదలో  ఏకాంతము  ఏమయ్యిందో  ఏమిటో
ఇదిగో  నీ  రాకతో  వెళిపోయింది  ఎటో
నాలో  మరో  నన్ను  చూశా  నీకో  స్నేహితుణ్ని  చేశా
కాలం  కాగితాలపై  జంట  పేర్లుగా  నిన్ను  నన్ను  రాసా

ఆకాశం  గొడుగు  నీడ  పుడమేగా  పూల  మేడ
ఏ  చూపులు  వాలకుండా  ప్రేమే  మన  కోటగోడ
నాకు  నువ్వై  నీకు  నేనై  ఏ  క్షణాన్ని  వదలకుండా
గురుతులెన్నో  పెంచుకుందాం  గుండె  చోటు  నిండా

మొదలేగా  కొత్తకొత్త  కథలు
మొదలేగా  కొత్తకొత్త  కలలు
ఇకపైనా  నువ్వు  నేను  బదులు
మనమన్నా  కొత్తమాట  మొదలు

మొదలేగా  కొత్తకొత్త  కథలు
మొదలేగా  కొత్తకొత్త  కలలు
ఇకపైనా  నువ్వు  నేను  బదులు
మనమన్నా  కొత్తమాట  మొదలు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది