Ayudha Pooja Song Lyrics In Telugu Devara






ఎర్రటి  సంద్రం  ఎగిసిపడే
అద్దరి  ఇద్దరి  అద్దిరిపడే  హోరు
రణధీరుల  పండగ  నేడు

హే  కత్తుల  నెత్తుటి  అలల  తడే
ఉప్పెన  పెట్టుగ  ఉలికిపడే  జోరు
మన  జట్టుగ  ఆడెను  సూడు

హే  ఉప్పూగాలే  నిప్పుల్లో  సెగలెత్తే
హే  డప్పూమోతలు  దిక్కుల్లో  ఎలుగెత్తే
పులిబిడ్డల  ఒంట్లో  పూనకమే  మొలకెత్తే
పోరుగడ్డే  అట్టా  శిరసెత్తి  శివమెత్తె

హైలా  హైల  ఇయ్యాల
ఆయుధ  పూజ  చెయ్యాలా
జబ్బలు  చరచాలా
జరుపుకోవాలా  జాతర

వీరాధి  వీరుల  జాతి  తిరణాల
ఉడుకు  రకతాలా
హారతులియ్యాలా  రార  ధీర  హో
ధీర  హో

హైల  ఇది  అలనాటి  ఆచారమే
ఇదిలా  కొనసాగందే  అపచారమే
బతుకే  నేడు  రణమైన  పరివారమే
కడలి  కాలం  సాక్ష్యమే

మన  తల్లుల  త్యాగాలే
చనుబాలై  దీవించే
కనుకే  ఈ  దేహం
ఆయుధమై  ఎదిగింది

తల  వంచని  రోషాలే
పొలిమేరలు  దాటించే
మన  తాతల  శౌర్యం
చరితలుగా  వెలిగింది

ఏటేటా  వచ్చే  ఈ  రోజే  మన  కోసం
మెలితిప్పిన  మీసం
మనమిచ్చే  సందేశం

హైలా  హైల  ఇయ్యాల
ఆయుధ  పూజ  చెయ్యాలా
జబ్బలు  చరచాలా
జరుపుకోవాలా  జాతర

వీరాధి  వీరుల  జాతి  తిరణాల
ఉడుకు  రకతాలా
హారతులియ్యాలా  రార  ధీర  హో

ఎర్రటి  సంద్రం  ఎగిసిపడే
అద్దరి  ఇద్దరి  అద్దిరిపడే  హోరు
రణధీరుల  పండగ  నేడు

హే  కత్తుల  నెత్తుటి  అలల  తడే
ఉప్పెన  పెట్టుగ  ఉలికిపడే  జోరు
మన  జట్టుగ  ఆడెను  సూడు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది